SAI CHAND EMOTIONAL MOTHER SONG LYRICS Writer: AmmapataThirupathi Music: Wilson Singer: Saichand Cast: Janulyri & DindigalaPurushotham, Baby Nihira Raam DOP & Editing : AjayKodam Screenplay & Direction: James Jampanna (Sannoor) Producer: Dindigala Purushotham Coordinators: Dindigala Purushotham, DasariBhaskar
SAI CHAND EMOTIONAL MOTHER SONG Lyrics in Telugu
అనువై కడుపులో నువు అడుగు మోపగా
అశీర్వదిస్తదమ్మా.. ఆ.. ఆ.. ఆ..
జీవకనమై తనలో జీవిస్తు ఉండగా
మన సుఖం కోరే జన్మా.. ఆ.. ఆ.. ఆ..
కడుపు నెల పొడుపువై పూసినా ఓ బిడ్డా
అమ్మ నిను ఆత్మ కనులతో చూసి ఆనంద పడుతది
తన కడుపులో పెరుగుతూ కదులుతున్నప్పుడూ
పులకరిస్తది అమ్మ ఆ గుండె చప్పుడూ
గర్భసంచిని పడక ఊగె ఊయల చేసి
ఆ ఆ ఆ జో..
గర్భసంచిని పడక ఊగె ఊయల చేసి
స్వాసతో నిను ఊయలూపేటి అమ్మా..
..ఆ.. ఆ.. ఆ.. ..ఆ.. ఆ.. ఆ..
..ఆ.. ఆ.. ఆ.. ..ఆ.. ఆ.. ఆ..
స్వాసతో నిను ఊయలూపేటి అమ్మా
తిప్పలెన్నో మోసి నొప్పులెన్నో తీసి…
ఈ.. ఈ.. ఈ..
పుడమిపై మన ప్రగతి కోరేటి జన్మ
మా..తృ జన్మా..
అమ్మా.. అమ్మా.. అమ్మా..
పురిటినొప్పులా ఎతరా
పూజించే దేవతరా
జన్మనిచ్చినా తల్లీ
జగతిలోన జాబిల్లి
నీ పాదాలకు సాస్టాంగ వందనం…
ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం
అమ్మా నీ పాదాలకు సాస్టాంగ వందనం…
ఓ.. ఓ.. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం
వెచ్చని నీ కడుపుల మోసి
వెలకట్టని ప్రేమను చూపి
బరువెక్కిన కడుపుతో అమ్మా
ప్రతి అడుగును పదిలంగేసి
ప్రాణవాయువందించగా..
పసిగుండె స్పందించంగా
మన ఆలనపాలన చూసే
కడుపులోన మనముండంగా
ఎంత జాలి గుండే.. ఏ..ఏ..ఏ..ఏ
అమ్మా.. ఎంత జాలి గుండే
అందుకే జగతి ఇలాగుండే
నా కన్నీళ్లతో నీ కాళ్లు కడిగినా మోక్షం రాకుండే.. ఏ..ఏ..
పురిటినొప్పులా ఎతరా
పూజించే దేవతరా
జన్మనిచ్చినా తల్లీ
జగతికే జా..బిల్లి
బ్రహ్మకైనా అమ్మవు నీవు
అపురూప జన్మవు నీవు
తల్లీ త్యాగాల చరితవే
బిడ్డల బంగారు భవితవే
రోతనలేని గుణమే నీది
ఈ జగతికి నువ్వు పునాది
నీ పేగున ప్రేమలు పండే
బతుకులో దీవెనలై నిండే
కర్రు నాగలై…. ఓ.. ఓ.. ఓ.. అమ్మా
కర్రు నాగలై.. కత్తులు నీ కడుపు దున్నినా…
బాలగమారె నేలన నెత్తుటి ధారలె చిందెనా
పురిటినొప్పులా ఎతరా
పూజించే దేవతరా
జన్మనిచ్చినా తల్లీ
జగతికే ఏ.. ఏ.. జాబిల్లి
పుట్టగానె బొడ్డును కోసి
పసిగుడ్డుకు ప్రాణం పోసి
చక్కని నీ ప్రేమను చూపి
చనుబాల ధారలు తాపి
ముద్దులతో చెంపలు తడిపి
ముద్దుగ నాన్నా అని పిలిచి
జాగ్రత్తలే పాటించగా జాగారాలెన్నో చేస్తవు
భాష రాని బాల్యం…….. ఆ.. ఆ.. ఆ..
భాష రాని బాల్యం… బాధని ఏడ్పుల పసిగడుతవ్
దిష్టితీసి తలకురులతోటి మా కష్టం తొలగిస్తవ్
పురిటినొప్పులా ఎతరా
పూజించే దేవతరా
జన్మనిచ్చినా తల్లీ
జగతికే ఏ ఏ జాబిల్లీ…
కొత్త బట్టలే తొడిగి
సూర్యచంద్రులంటూ పొగిడి
అందమెట్ల ఉన్నాగానీ
అందలాని కెత్తుకుంటదీ
కండ్లముందు కనబడకుంటే
సడుగులెంట అడుగులేస్తది
ఆకలి మన కడుపును జూసి
అమ్మా అల్లాడి పోతది
మచ్చలేని ప్రేమా… ఓ.. ఓ.. ఓ..
మచ్చలేని ప్రేమా.. మానవతకు చిరునామా
పంచభూతాలు ప్రాణదాతవని కొనియాడే ప్రేమా.. ఆ… ఆ..
పురిటినొప్పులా ఎతరా
పూ…జించే దేవతరా
జన్మనిచ్చినా తల్లీ
జగతికే ఏ ఏ జాబిల్లీ…
నీ పాదాలకు సాస్టాంగ వందనం
ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం
అమ్మా నీ పాదాలకు సాస్టాంగ వందనం ఓ.. ఓ..ఓ
ఏమిచ్చిన తీరనిదమ్మా…. నీ…నీ… రుణం
SAI CHAND EMOTIONAL MOTHER SONG VIDEO
Song : SAI CHAND EMOTIONAL MOTHER SONG
Writer: Ammapata Thirupathi
Music: Wilson
Singer: Saichand
Cast: Janulyri & DindigalaPurushotham, Baby Nihira Raam
Screenplay & Direction: James Jampanna (Sannoor)
Producer: Dindigala Purushotham