Nanna Song 2023 Fathers Day Songs Relare Ganga Kalyan Keys Pasunoori Ravinder Nanna Song 2023 Lyrics in Telugu
Nanna Song 2023 Lyrics in Telugu
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
పేరులేని శిల్పిలాగా కడదాక
బతుకంతా గడిపెటోడు
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
తరిరిర రారారరరే రారే… ఏ… ఏ… ఏ… ఏ…
తరిరిర రారారరరే రారే…
రారారరరే రా…
బాలింతయ్యి అమ్మా
పట్టె మంచము మీదుంటే
పొయ్యికాడా నాన్న
పొగ ఊదె ఊపిరవుతాడు
చేతివేళ్లే కాలినా
చెరగని చిరునవయ్యేటోడు
చేతివేళ్లే కాలినా
చెరగని చిరునవయ్యేటోడు
పురుటినొప్పులె లేవు నాన్నకు…
పుడమినొప్పులె కడదాకా
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
ఆడపిల్ల పుడితె నాన్న
మా అమ్మని జెప్పుకుంటడో
కొడుకు కొంటె పనులల్లో
కన్నతండ్రినీ తలుసుకుంటడో
ముద్దు పిలుపులతోటి నాన్న
ప్రేమ ముద్దయిపోతూ ఉంటడో
ముద్దు పిలుపులతోటి నాన్న
ప్రేమ ముద్దయిపోతూ ఉంటడో
రెక్కలొచ్చి ఎగిరిపోతే…
దారి దిక్కులన్నీ వెతుకుతుంటడో
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
కోపాన్ని దిగమింగుకోని
దు:ఖాన్ని దాసుకుంటడో
పిల్లలెదుగుతుంటె మెల్లగా
ఒంటి సోకులన్ని ఒదులుకుంటడో
రోగమెంతదైన గానీ
లెక్కజెయ్యని తెగువ నాన్న
రోగమెంతదైన గానీ
లెక్కజెయ్యని తెగువ నాన్న
సావు ఎంటబడుతున్నా
పూటకొక్కసారి పుడుతుంటడో
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
తరిరిర రారారరరే రారే… ఏ… ఏ… ఏ… ఏ…
తరిరిర రారారరరే రారే…
రారారరరే రా…
బంధాలు మరిచిన బిడ్డలు
బాధ పెట్టేటి మాటలంటే
ఎదల మీద ఆడినోళ్లే
తన గుండె మీద తన్నుతుంటే
వంతులల్లో పంచుకోని
తిండిపెట్టకుండ వదిలేస్తే
వంతులల్లో పంచుకోని
తిండిపెట్టకుండ వదిలేస్తే..
కాలమే ఇట్లున్నదాని
కరుణించేటి గుణమే నాన్న
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
పేరులేని శిల్పిలాగా కడదాక
బతుకంతా గడిపెటోడు
అన్నీ తానైనోడు
ఆశల దీపమైనోడు నాన్న
Nanna Song 2023 Video
Written and sung by: Pasunuri Ravindhar
Music : Kalyan Keys
Camera : Siva LD
Editing: Vishwan Raj
Producer : Pawan Sahitya
Poster : Daruvula Rajkumar