Mangli Bonalu Full Song 2023 Director Damu Reddy Singer Mangli Lyrics Kamal Eslavath Music Madeen SK
Mangli Bonalu Song 2023 Lyrics in Telugu
జోడు డప్పుల్ మోగె జోరు సప్పుల్
యెంట యాట పిల్లల్.. నాటు కోడి పుంజుల్
నీ తానకు బైలెల్లినమే మైసమ్మ
తల్లి పిల్ల జెల్ల కదిలినమే ఎల్లమ్మ మా మా మా మా
హెయ్ పచ్చికుండల్ పెట్టి పసుపు సున్నాల్
కట్టి కొత్త బట్టల్ ఎత్తినామె బోనాల్
పాయసాలు తెచ్చినమే పోశమ్మ
నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మా మా మా మా మా
నెత్తి సుట్ట బట్ట సూసి మురిసెనంట
సుట్టూర శివాలూగె సంబురాలు గంట
కుంకుమద్దె నంట గోలుకొండ కోట
గజ్జెకట్టి దరువులేసి ఆడే బల్కమ్పేట.. పేట.. పేట.. పేట.. పేట
తడిబట్ట తానాల్.. నియమాల బోనాల్
జగదాంబ జేజమ్మకు నిండు ఒక్క పొద్దుల్
సూడు గొడ్డు గోదల్ పల్లె పాడి పంటల్
ఏటేటా ముట్టజెప్పుకుంటామే ముడుపుల్
ఆషాడ మాసాల్ అంకురాల బోనాల్
ఆరగించ రారాదు బెల్లం నైవేద్యాల్
తాటి కొమ్మలాకుల్ మేటి కల్లు శాకల్
నచ్చినట్లు తెచ్చినాము తీరు ఫలహారాల్
ఉజ్జయిని మహంకాలి.. ఓరుగల్లు భద్రకాళి
రావె రావె రావె తల్లీ తల్లీ తల్లీ తల్లీ తల్లీ
నిమ్మకాయ దండల్.. యాపాకు మండల్
మాల కట్టి తెచ్చినాము జర ఇడ్చు దండాల్
ఎండిగండ దీపాల్ కరిగిచ్చే పాపాల్
కాళికా కరుణగళ్ల నీ సల్లని సూపుల్
ఈరగోనె దెబ్బల్ పెట్టే పెడ బొబ్బల్
మహిమళ్ల మహంకాళి కేమంత కొల్పుల్
గుడిసుట్టూ మేకల్ పెట్టె గావు కేకల్
కూతవెట్టి పోతరాజు ఆడె వీరంగాల్
ఇంద్రాకీలాంద్రి కనక దుర్గా మమ్మేలుకొనగ
రావె రావె రావె తల్లీ తల్లీ తల్లీ తల్లీ తల్లీ
కూడినాము సుట్టాల్ మర్సినామ్ కష్టాల్
జగమేలే తల్లికి పెట్టంగ పట్టు బట్టల్
కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్
గావురాల తల్లికి తొడగంగ పైడి మెట్టెల్
లాలు దర్వాజల్ హాలీజాన యాకుల్
షాలిబండ గోలిపుర దేవీ దర్బారుల్
పోటెత్తే భక్తుల్ ఎల్లా ఆదివారాల్
రంగమున వినుపించు నీ మనసుల మాటల్
రా రా రా రా తల్లీ తల్లీ తల్లీ తల్లీ తల్లీ
జోడు డప్పుల్ మోగె జోరు సప్పుల్
యెంట యాట పిల్లల్.. నాటు కోడి పుంజుల్
నీ తానకు బైలెల్లినమే మైసమ్మ
తల్లి పిల్ల జెల్ల కదిలినమే ఎల్లమ్మ మా మా మా మా
హెయ్ పచ్చికుండల్ పెట్టి పసుపు సున్నాల్
కట్టి కొత్త బట్టల్ ఎత్తినామె బోనాల్
పాయసాలు తెచ్చినమే పోశమ్మ
నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మా మా మా మా మా
Mangli Bonalu Song 2023 Video
Song : Mangli Bonalu Song 2023
Director- Damu Reddy
Singer- Mangli
Lyrics- Kamal Eslavath
Music – Madeen SK