Skip to content
Home » Ededu Dappulla Song Lyrics in Telugu

Ededu Dappulla Song Lyrics in Telugu

Ededu Dappulla Song Lyrics : Ededu Dappulla Bonam Paata 2023 Bonalu Song Latest Folk Songs yrics Shankar poddupodupu Singer Dasa Laxmi Music Kalyan Keys Dop Kamili Patel Editing DI Srinivas Anneboina Choreography & Direction Manu Michael

Ededu Dappulla Song Lyrics in Telugu

ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ

పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ

ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

అగ్గిదేవుడుదెరు గుగ్గీలమెదురు గుగ్గలమెదురు
నాగుంబాములెదురు నడికట్టు ఎదురు నడికట్టు ఎదురు

యాపాకొమ్మాలెదురు దీపాలు ఎదురు దీపాలు ఎదురు
కోడీపుంజులెదురు యాటళ్లు ఎదురు యాటళ్లు ఎదురు అహా..

చల్​ చల్​
ఇందూరు ఎల్లమ్మ పొదిరెడ్డి పోశమ్మ
జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ

ఇందూరు ఎల్లమ్మ పొదిరెడ్డి పోశమ్మ
జూబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ

తల్లీ……………….
ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మహంకాళి
దయగల్ల సూపువే ఓరుగల్లు భద్రకాళి

ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మహంకాళి
దయగల్ల సూపువే ఓరుగల్లు భద్రకాళి

ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

ఆషాడమాసాన బోనాలు సురువు బోనాలు సురువు
ఆదివారం గోలే వేసేము దరువు వేసేము దరువు

గడపల్ల పోసేము కల్లు శాకాలు కల్లు శాకాలు
కాపాడ రావమ్మా ఎల్లా లోకాలు ఎల్ల లోకాలు

ఆ ఆ
అత్తగిరి పోశమ్మ కట్కూరి ఎల్లమ్మ
గండిపేట మైసమ్మ గవ్వల దుర్గమ్మ

అత్తగిరి పోశమ్మ కట్కూరి ఎల్లమ్మ
గండిపేట మైసమ్మ గవ్వల దుర్గమ్మ

అమ్మా…………….
ఆదిశక్తి రూపమే మధురలోన మీనాక్షీ
బాధలన్నీ బాపవే కంచిలోన కామాక్షీ

ఆదిశక్తి రూపమే మధురలోన మీనాక్షీ
బాధలన్నీ బాపవే కంచిలోన కామాక్షీ

ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

పోతరాజులాట పొర్లు దండాలు పొర్లు దండాలు
అబ్బబ్బ అనిపించే ఊగే శిగాలు ఊగే శిగాలు

సిత్తముతో కట్టేము సికల దండాలు సికల దండాలు
నీముందు పెట్టేము సీరే సారేలు సీరే సారేలు

అగో అగో
గొలుకొండ ఎల్లమ్మా గోసలు తీర్చమ్మా
బంగరు మైసమ్మా రందులు బాపమ్మా

గోలుకొండ ఎల్లమ్మా గోసలు తీర్చమ్మా
బంగరు మైసమ్మా రందులు బాపమ్మా

తల్లీ……………….
నీ కండ్లల్ల మెరుపులే మావురాల ఎల్లమ్మా
బైండ్లోళ్ల కొలుపులే మా తల్లీ పెద్దమ్మ

ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ

పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ

ఏడేడు డప్పుల్ల ఇలకోటి మందిళ్ల
శివసత్తుల కూతల్ల జమిడీకల మోతళ్ల

పొద్దుగదులుతున్నదే మావురాలెల్లమ్మ
గద్దెకాడికత్తిమే జగములేలె పెద్దమ్మ

Song : Ededu Dappulla Bonam Paata
Lyrics: Shankar poddupodupu
Singer: Dasa Laxmi
Music: Kalyan Keys
Dop : Kamili Patel
Editing: DI :Srinivas Anneboina
Choreography & Direction: Manu Michael

– Ededu Dappulla Song Lyrics